శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డిపై కేసు నమోదు అయింది. ధర్మవరం సబ్జైలు దగ్గర జరిగిన ఘటనలో కేతిరెడ్డితో పాటు అనుచరులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కాగా వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి కారుపైకి ఎక్కేందుకు ఓ కార్యకర్త ప్రయత్నం చేశారు. అయితే కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. దీంతో కార్యకర్త కిందపడ్డారు. స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. జైలు వెళే ఆలోచన ఉంటే కేతిరెడ్డిని త్వరలో ఆ పని చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డిపై కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చగా మారింది.