చాలా మందికి ప్రతి రోజు బ్యాంకుల్లో ఏదో ఒక పని ఉంటుంది. లావాదేవీలు, డిపాజిట్లు తదితర పనులు చేసుకుంటుంటారు. అయితే ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించడం చాలా ముఖ్యం.దీని ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల రానుంది. ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు భారీగానే ఉండనున్నాయి. ఏకంగా సగం రోజుల పాటు అంటే 14 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.
అక్టోబర్ నెలలో చాలా పెద్ద పండుగలు వస్తాయి. గాంధీ జయంతి నుండి దసరా వరకు, ఈ నెలలో చాలా పెద్ద పండుగలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు కూడా సెలవులు రానున్నాయి. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, ముందస్తు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అక్టోబరులో ఏ రోజు ఏయే ప్రదేశాలలో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకుందాం.
అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 3: నవరాత్రి ప్రారంభం, మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా హర్యానా, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 6: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెవులు
అక్టోబర్ 10: మహా సప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 11: మహానవమి సందర్భంగా ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 12: ఆయుధ పూజ, దసరా, రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 13: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
అక్టోబర్ 14: దుర్గాపూజ (దస్సేన్), గాంగ్టక్ (సిక్కిం)
అక్టోబర్ 16: లక్ష్మీ పూజ, అగర్తల, కోల్‌కతా
అక్టోబర్ 17: వాల్మికి జయంతి సందర్భంగా అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్మూ
అక్టోబర్ 20: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
అక్టోబర్ 26: నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్ (విలీన దినం- జమ్మూఅండ్ కశ్మీర్)
అక్టోబర్ 27: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
అక్టోబర్ 31: దీపావళి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్