ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజు స్పందించారు. తాను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ముందుగా తన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు.. ప్రస్తుతం తాను షూటింగ్లో భాగంగా విదేశాల్లో ఉన్నానని అన్నారు. త్వరలో వచ్చి పవన్ వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని ప్రకాశ్ రాజు స్పష్టం చేశారు. ఈ గ్యాప్‌లో ముందుగా నా ట్వీట్‌ను చూసి అర్థం చేసుకోవాలంటూ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. ‘డియర్ పవన్ కల్యాణ్ గారూ.. మీ ప్రెస్ మీట్ చూశాను.. నేను చెప్పింది ఏంటి.. మీరు తప్పుగా అర్థం చేసుకుని చెబుతున్నదేంటి.. నేను విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాను. మీ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి 30వ తేదీ తర్వాత తిరిగి వస్తాను. ఇంతలో మీరు ముందుగా నా ట్వీట్‌ని చూసి అర్థం చేసుకొండి ప్లీజ్..’ అంటూ ప్రకాశ్ రాజు ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.