తిరుపతి లడ్డు వివాదంపై ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్య మోషేను రాజు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డు కల్తీపై తాను కూడా సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీ జరిగిందని చెప్పారని.. తిరుపతి లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
నిజంగా కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహితం కూడా కోర్టుకు వెళ్లాయన్నారు. నిజాలు వాస్తవాలు బయటకు రావాలని.. దేవుడి దగ్గర జరిగిన నిజాలు ప్రజలకు తెలియాలని మోషేను రాజు పేర్కొన్నారు.