భారీ వర్షాలు, వరద బాధితులకు అందజేసే సాయంపై ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తైయింది. ఏపీ వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. .విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది బాధితులు ముంపు బారిన పడ్డారు. బాధితులకు సాయం కింద అందించే ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది.ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్సుకు కంటే మించిన స్థాయిలో ఏపీ ప్రభుత్వం సాయం అందజేస్తోంది.ముంపు ప్రాంతాల్లో రూ 180 కోట్ల మేర బ్యాంక్ రుణాల రీ-షెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియలో బాధితులు ఎవరైనా మిస్ అయితే నిబంధనల ప్రకారం వారికీ ఆర్థిక ప్యాకేజీ అందించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందజేయనున్నారు.