ఏపీలో గత నెలలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కుండపోతగా పడటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహించింది. బుడమేరు వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగాయి. దీంతో పలువురు బాధితులు సర్వసం కోల్పోయారు. విజయవాడ వరదలకు బ్యాక్టీరియా వల్ల కాలు కోల్పోయిన బాధితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సాయం అందజేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. రూ. 10 లక్షల ఎల్‌ఓసీ ఇస్తూ లేఖ విడుదల చేశారు.
జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో వరదల వల్ల వచ్చిన బాక్టీరియాతో బాధితుడు ఒక కాలు కోల్పోయాడు. రెండో కాలికి కూడా ఇదే లక్షణాలు ఉండటంతో ప్రత్యేక చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం చంద్రబాబు దృష్టికి బాధితుడి సమస్యను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తీసుకు వెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల వరకు వైద్యం అందించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు సీఎంఓ అధికారులు లేఖ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం చేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.