గుత్తి మున్సిపాలిటీలోని రెండో వార్డుకు చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ సూరి బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి టీడీపీ ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ, పట్టణ అధ్యక్షులు ఎంకె చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారు పార్టీకి ఆయన లేని లోటు తీరనిదని, ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు.