గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, కానీ గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికే అనేక ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీతో చర్చించామన్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. వాటిని పరిష్కరించినట్లు కూడా చెప్పారు. ఓ పెద్ద ఐటీ కంపెనీ 1,500 మందికి ఉద్యోగాలు కల్పించనుందన్నారు. కానీ ఆ కంపెనీకి గతంలో వీధిదీపాలు కూడా వేయలేదని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారికి కావాల్సిన బస్ సౌకర్యం కూడా అందించలేదన్నారు. టీడీపీ వచ్చాక అవన్నీ క్లియర్ చేశామని, కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారని తెలిపారు. ఫీల్డ్ విజిట్స్‌కి కూడా వెళుతున్నట్లు చెప్పారు.