గడిచిన ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని అప్పటి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆశించినప్పటికి, అది దక్కకపోవడంతో ఉండి ఎమ్మెల్యే టిక్కెట్‌ను కేటాయించారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే అధిష్ఠానం ఆదేశాల మేరకు సీటును త్యాగం చేశారు. రామరాజు భవిష్యత్‌కు చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీనికి కట్టుబడి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. రామరాజు వైసీపీ హవా వున్న 2019లోనే ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. త్యాగంతోనే కార్పొరేషన్ పదవి దక్కింది.