నటుడు ప్రకా్షరాజ్ సున్నిత అంశాల విషయంలో తెలుసుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకా్షరాజ్ తనకు మంచి మిత్రుడని, అతనిపై ఎంతో గౌరవం ఉందని, అయితే సనాతన ధర్మ పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడటం కూడా తప్పే అని ప్రకాష్ రాజ్ చెబితే ఎట్లా అని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో జోకులు వేయడం సరికాదని తమిళ నటుడు కార్తిని ఉద్దేశించి అన్నారు. ‘‘సినీ ఫంక్షన్లో లడ్డూ సున్నిత అంశం అంటూ (కార్తి) సరదాగా మాట్లాడారు. అలా అనొద్దు. నేను నటులను గౌరవిస్తా. మీరు ఒకటికి వందసార్లు ఆలోచించుకుని మాట్లాడండి’’ అని అన్నారు. ఇదే తప్పు ఓ మసీదుకు, చర్చికి జరిగితే ఇలానే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ‘‘ఇదేనా మీరు చెబుతున్న లౌకిక వాద ధర్మం? సనాతన ధర్మం పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. తోటి హిందువులను సాటి హిందువులే తూలనాడటం మానుకోవాలి’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.