కాపురానికి తీసుకువెళ్లడం లేదని మనస్థాపం చెందిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడిందని మండపేట పట్టణ ఎస్‌ఐ హరి కోటి శాస్త్రి తెలిపారు. మండపేట ఏడిద రోడ్డులో వున్న అసాదుల కుటుంబానికి చెందిన గిరిసాల చిట్టివేణి(33)కి విజయవాడకు చెందిన ప్రభుకుమార్‌తో 2021లో వివాహమైంది. వీరిది కులాంతర వివాహం. ప్రభుకుమార్, అతడి కుటుంబసభ్యులు వేధిస్తుండటంతో చిట్టివేణి 2023లో పుట్టినిల్లు మండపేట వచ్చేసింది. ఏడాదిగా తల్లి వద్దనే ఉంటుంది. భర్త, అత్తింటి వేధింపులపై మండ పేట పట్టణ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కాపురానికి తీసుకువెళ్తామని భర్త కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే ఎంతకి తీసుకువెళ్లక పోవడంతో మనస్థాపం చెందిన ఆమె మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరు లేని సమయంలో చున్నితో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తహసీల్దార్ తేజేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐ హరికోటిశాస్త్రి సిబ్బందితో అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.