మదనపల్లె సర్వజన బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎంఎస్‌రాజు పూర్తి బాధ్యతలు స్వీకిరంచారు. ఈ సందర్భంగా మంగళవారం ఆస్పత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రజ లకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆస్పత్రి అభివృద్థికి తనవంతు పాటుపడుతానన్నారు. మెరుగైన వైద్యసేవలను అందించడానికి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆస్పత్రికి కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్వజన బోధనాస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.