బాలికలకు కళాశాలల్లో లింగవివక్షపై అవగాహన కల్పించాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని శ్రీకాకుళం ఆర్డీవో సీహెచ్ రంగయ్య తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో లింగనిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టం అమలుపై సబ్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భం గా మాట్లాడుతూ స్కానింగ్కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం స్థానిక 80 అడుగుల రోడ్డులో గల ఓ ప్రైవేటు హాస్పిటల్లో కమిటీ సభ్యులతో తనిఖీచేశారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో శ్రీకాంత్, కిరణ్కుమార్, స్వీప్ కె.రమణమూర్తి, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి పాల్గొన్నారు.