ఉత్తరప్రదేశ్‌లోని జనవరి 21, 2023న షాకింగ్ ఘటన జరిగింది. దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఆబిద్ (48) అనే వ్యక్తి తన తల్లిని పని నిమిత్తం పొలాల్లోకి తీసుకెళ్లి.. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం ఆబిద్ పారిపోయాడు. ఆ తర్వాత అతడి సోదరులు ఆబిద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడికి బులంద్‌షహర్ జిల్లా కోర్టు సోమవారం రూ. 51,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.