ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుక్రుడు ప్రభావం అన్ని రాశుల మీద ప్రభావం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 03:13 PM

 జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విషయాలాను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం. శుక్రుడు కీర్తి, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు సంపద పెరుగుతుంది.కాబట్టి శుక్రుడు ప్రభావం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. నవంబర్ మాసంలో శుక్రుడు ధనుస్సురాశిలోకి సంచరించబోతున్నాడు. ఈ సంచార ప్రభావంతో 3 రాశాల వారి అదృష్టం అద్భతుంగా మారబోతుంది. ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా స్థిరపడుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.శుక్రుని ఆశీస్సులు పొందే ఆ రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.


సింహం సింహరాశి వారికి శుక్ర సంచారం వల్ల అన్నింట్లో విజయం పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం మారాలని ఎదురుచూస్తున్నవారికి ఇది సదావాకాశం. అలాగే ప్రమోషన్లు, జీతం పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఈ లాభాలతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి సరిపడా డబ్బు ఉంటుంది. వాటితో భవిష్యత్తులో మంచిపెట్టుబడుతు, లాభాలు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


తుల:  ఈ రాశుల వారు వ్యాపారం అభివ్రుద్ది చేసుకోవడాని తద్వారా మంచి లాభాలను పొందడానికి శుక్రుడు సహకరిస్తారిస్తాడు .శుక్రుడి సంచారం వల్ల తులా రాశి వైవాహిక జీవితం మరియు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉండవచ్చు. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. షేర్ మార్కెట్లు ఇతర మార్గల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ సమయంలో చాలా లాభాలు వస్తాయి.


మీనం : మీన రాశి వారికి శుక్ర సంచారం వల్ల ప్రేమికులకు మంచిగా ఉంటుంది, వారి ప్రేమ ఫలించే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో భార్యభర్తలు ఆనందంతో గడుపుతారు. స్నేహపూర్వకంగా ఉంటారు. శుక్రుని ఆశీస్సులలో వ్యాపారంలో పెద్ద లాభాలు పొందుతారు . అలాగా కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. బ్యాచులర్ గా ఉండే వారికి వివాహ ప్రతిపాధనలు రావచ్చు. పెళ్ళి కుదురుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడి అనుగ్రహంతో సమస్యల నుండి ఒత్తిడి నుండి బయటపడుతారు, మానసిక ప్రశాంతత పొందుతారు


వృషభం : శుక్రసంచారంతో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా చురుకుగా ఉంటారు. ఆసక్తి పెరుగుతుంది. దేవాలయను సందర్శించవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అందరూ ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబందాలు ఉంటాయి. ప్రేమికులకు మంచి రోజులు. వారి ప్రేమ ఫలించి , పెళ్ళికి దారితీస్తుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com