తన ఇంటి వద్ద జనసైనికులు చేసిన ఆందోళనపై పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను హెచ్చరించారు. ఉడత ఊపులకు, బెదిరింపులకు బెదిరేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కులం లేదు, మతం లేదని హిందువులందర్నీ రెచ్చగొడుతూన్నారని ఆగ్రహించారు.