ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్విచక్రవాహనాల దొంగలని అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:17 PM

అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె గ్రామం వద్ద గైని నాగరాజు, గైని వెంకటేశ్వర్లును అనే ఇద్దరు ద్విచక్రవాహనాల దొం గల ను అరెస్టు చేసి వారి వద్ద నుం చి 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని రూరల్‌ పోలీ్‌సస్టేషనలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. ఈనెల 24న మండలంలోని వెంకటాంపల్లి గ్రామ సమీపంలోని పొలంలో డేరంగుల వెంకటప్రసాద్‌ అనే వ్యక్తి తన పొలం వద్ద ద్విచక్రవాహనాన్ని నిలిపిఉంచి పొలంలో పనులు చేసుకుంటుండగా.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన గైని నాగరాజు ద్విచక్రవాహనాన్ని దొంగిలించాడన్నారు. గమనించిన డేరంగుల వెంకటప్రసాద్‌ మరికొందరి సాయంతో నిందితున్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు.


అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా మరికొన్ని ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు నిర్ధారణ అయిందన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మండలంలోని సజ్జలదిన్నె గ్రామం వద్ద దొంగిలించిన ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని వాటికి కాపలాగా ఉన్న గైని వెంకటేశ్వర్లును అరెస్టు చేశామన్నారు. ఇరువురు నిందితులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. అనంతరం వీరిని రిమాండ్‌కు పంపామని సీఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com