గ్రామాల్లో అభివృధ్దికి అధికారులు కృషి చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. గురువారం రాత్రి మంత్రాలయం ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభావతి దేవి, తహసీల్దార్ రవి అధ్యక్షత అధికారులతో సమావేశం నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రోడ్లు, విద్య, వైద్యం, శిశు సంక్షేమం, పౌరసరఫరా, గ్రామాల్లో గృహ నిర్మాణాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాదించాల్సిన ప్రగతి, పనులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఏవో జీరగణేష్, పీఆర్ ఏఈఈ నరసింహులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వేదస్వరూప, వైద్యాధికారులు సురేష్, అశోక్ కుమార్, ఏపీవో తిమ్మారెడ్డి, ఈసీ శ్రీనివాసులు, రామయ్య, ఆనంద్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మిబాయి, నాగలక్ష్మి, ఎంఈవోలు మైనుద్దీన్, రాగన్న పాల్గొన్నారు.