రైతులు శనగను అక్టోబరు 15 నుంచి నవంబరు 15లోపు సాగు చేసుకోవాలని డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుజాత సూచించారు. గోనెగండ్ల పరిధిలోని వేముగోడు గ్రామంలో ఎన్‌జిఆర్‌ఏ ఎరువాక కేంద్రం ఆధ్వర్యంంలో గురువారం శనగరైతులకు ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. శనగ విత్తే ముందు విటావాక్స్ పవర్‌తో విత్తనశుద్ది చేసుకోవాలన్నారు. కలుపు మొలకెత్తకుండా విత్తిన 48 గంటల్లోపు పెండిమి తాలిన్ మందును పిచికారీ చేసుకోవాలని అన్నారు.
వెర్రి తెగులు ఆశించిన మొక్కలను తొలగించాలన్నారు. వరిలో అగ్గితెగులు నివారణకు వెసాప్రదీ యల్ 300 మిలీ. మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. డ్రోన్‌తో పురుగు మందు లను పిచికారీ చేసే విధా నాన్ని చూపిం చారు. ఏడీఏ మహుమ్మద్ ఖాద్రీ, ఏవో హేమలత, జాకీర్, లక్ష్మన్న పాల్గొన్నారు.