వ్యవసాయంలో రైతులకు ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడల వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. అయితే పంటను ఆశించే వివిధ రకాల పురుగులను కట్టడి చేసేందుకు కొన్ని రకాల ట్రాప్స్ అందుబాటులోకి వచ్చాయి.
వాటిలో లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్, విషపు ఎరలు వంటివి ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేయడం వల్ల చీడపీడల ఉద్ధృతి, సంతతి పెరగకుండా కట్టడి చేస్తాయి. దీంతో రసాయన పురుగు మందుల వాడకం తగ్గుతుంది. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి.