ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీరు ఉన్న బకెట్‌లో పడి మృతి చెందింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర గుండిబండ మండల పరిధిలో జరిగింది. ఎస్ఎస్ గుండ్లు గ్రామంలో జయరామ్ అనే రైతు కూతురు బయట ఆడుకుంటూ నీరు ఉన్న బకెట్‌లో పడి ఊపిరాడక మరణించింది. ఆ సమయంలో తల్లి ఇంట్లో భోజనం చేస్తుండడంతో గమనించలేదు. తర్వాత చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa