గుత్తి పట్టణంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా ఉక్కుపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది.
మరో పక్క డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్రైనేజీ మురికి నీరు రోడ్డు మీదకు పారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.