వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగనుంది. దీని కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది.
కుంభమేళా సందర్భంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు వివిధ మౌలిక సదుపాయాలు, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన కోసం మంత్రిత్వశాఖ రూ.933 కోట్లను సైతం కేటాయించింది.