తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మూడో రోజు కూడా విచారణ కొనసాగించింది. సిట్ అధికారులు ఇవాళ టీటీడీ పిండిమర, ల్యాబ్ ను పరిశీలించారు. తిరుమలలోని గోడౌన్లు, రీసెర్చ్ సెంటర్లను పరిశీలించారు. గోడౌన్లకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ లో నాణ్యతా పరీక్ష యంత్రాల వివరాలు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లలో ముడిసరుకుల నాణ్యతను పరిశీలించారు. విచారణ తొలి రోజున కీలక సమావేశం నిర్వహించిన సిట్... రెండో రోజు టీటీడీ ఈవో, ఇతర అధికారులతో భేటీ అయింది. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలోని ఈ సిట్ మూడు బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తోంది.