చంద్రబాబు, పవన్‌లను హిందువులందరూ ఛీ కొడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దేవుడ్ని వివాదాల్లో తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదు.. కేసు పెట్టకుండా, విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడాడని అన్నారు. నాటుసారా తాగిన వ్యక్తి మాట్లాడినట్లూ సీఎంగా హోదాలో ఉంటూ అసత్యాలు మాట్లాడరని చెప్పారు. సుప్రీంకోర్టు సరైనా విధంగా ప్రశ్నించింది… దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారు.. నిజం ఎప్పటికి గెలుస్తుంది.. తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా తాము విచారణ కోరామన్నారు. స్వామీ వారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడారు.. బాబు, పవన్‌లను హిందువులందరూ ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు.