శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను దెబ్బేతీసే విధంగా, టీటీడీ దేవస్థానంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచేలా ప్రయత్నించినందుకు ఇద్దరు బాధ్యులేనని పేర్కొన్నారు. హిందూవులను తమ అబద్దాలతో, మోసం చేసినందుకు పశ్చాతాపంగా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని,. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది.