ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని.. నడకమార్గంలో శ్రీవారిని దర్శించుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో నడకమార్గంలో 3 లేయర్ సెక్యూరిటీని పోలీసులు ఏర్పాటు చేశారు.తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ .. గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు,హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారితో ఓ సనాతన ధర్మ బోర్డ్ ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవన్ కళ్యాణ్ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వాన్ని తూర్పార పట్టడంలో హిందూత్వ పార్టీ అయిన బీజేపీ కంటూ జనసేనానే కాస్త దూకుడుగా వ్యవహరించారని రాజకీయా వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోవైపు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో ప్రతిపక్ష వైసీపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలుస్తుంది.