ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మెట్రోలో ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. మెట్రోలో ఇద్దరు యువకులతో ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది.
దీంతో సదరు ప్రయాణికుడు ఆ కుర్రాళ్లను దుర్భాషలాడారు. దీంతో సహనం కోల్పోయిన ఆ కుర్రాళ్ళు ఆ వ్యక్తిని పలుమార్లు చెంప దెబ్బ కొట్టారు. వెంటనే తోటి ప్రయాణికులు వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa