డ్రగ్స్ బారి నుంచి యువకులను రక్షించాలని సినీనటుడు సాయి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బొబ్బిలిలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వ ర్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ఉచ్చులో చిక్కుకున్న వారు అథపాతాళానికి వెళ్లిపోకుండా రక్షించుకోవాలన్నారు. సైనికులు త్యాగాలకు ఓర్చుతూ మనల్ని కాపాడుకుంటున్నారని, వారే రియల్ పోలీసులన్నారు.
ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం పరితపించాలని సూచించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ..... యువత డ్రగ్స్ వినియోగానికి బానిసలవుతున్న విషయాన్ని గమినించి సమరానికి శంఖారావం పూరించామని తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరించారు. ప్రతి కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసలైన వారిని డీఅడిక్షన్ సెంటర్‌కు పంపించి వారిని రక్షిస్తామని తెలిపారు. తొలుత విద్యార్థులతో బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించా రు. అనంతరం విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. బొబ్బిలి, చీపురుపల్లి డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, రాఘవులు, సీఐ కటకం సతీష్‌కు మార్, రౌతు వాసుదేవరావు, తూముల కార్తీక్ పాల్గొన్నారు.