దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అనకాపల్లి నుంచి పలు ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఏడీఎం రవిచంద్ర తెలిపారు. అనకాపల్లి నుంచి విజయవాడ వెళ్లి తిరిగి అనకాపల్లి చేరుకునేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.900లు చార్జీ వసూలు చేస్తామన్నారు.
అలాగే అనకాపల్లి నుంచి విజయవాడ, ద్వారకాతిరుమల, తిరిగి అనకాపల్లికి రూ.950లు, అనకాపల్లి నుంచి విజయవాడ, ద్వారకాతిరుమల, ద్వారపూడి మీదుగా తిరిగి అనకాపల్లికి రూ.1,000, అనకాపల్లి నుంచి భద్రాచలం, విజయవాడ, ద్వారకాతిరుమల మీదుగా తిరిగి అనకాపల్లికి రూ.1,220లు, అనకాపల్లి నుంచి భద్రాచలం, పర్ణశాల, విజయవాడ, ద్వారకాతిరుమల, ద్వారపూడి మీదుగా తిరిగి అనకాపల్లికి రూ.1,300 చార్జీ వసూలు చేస్తామన్నారు. పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయన్నారు.