శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో కళ్యాణదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరా బంద్ అయింది. దీంతో నీటి ఇబ్బంది ఏర్పడడంతో స్థానిక వడ్డేబండ వీధి మహిళలు బుధవారం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో టీ సర్కిల్లోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సరఫరాకు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయడంలో మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అంతలోనే మున్సిపల్ సిబ్బం ది, పోలీసులు చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే ఆ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు జోక్యం చేసుకుని తక్షణ మే మీకు నీటి ట్యాంకర్ పంపి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారు.