మదనపల్లెలో బుధవారం నుంచి ఈ నెల 11 వరకు దసరా మహోత్సవాలు పలు ఆలయాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓం ప్రకాష్, ఆర్యవైశ్య అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు ప్రత్యేక అలంకరణలు, అర్చనలు, విశేష పూజలు, అన్నదానం నిర్వహిస్తామన్నారు. స్థానిక చౌడేశ్వరీదేవి ఆలయంలో బుధవారం నుంచి దసరా ఉత్స వాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ అధ్య క్షుడు పురాణం చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు రామిశెట్టి రత్న మయ్య, ట్రెజరర్ తెలిపారు. విద్యుత అలంకరణలతో ఆల యం శోభాయానుమానంగా అలంకరించారు. కోర్టు ఆవర ణలో వెలిసిన కోర్టులో గంగమ్మకు విజయదశమి పురస్క రించుకుని దేవీ నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేపసినట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.
దేవతాన గర్‌లోని రాజరాజేశ్వరీ ఆలయంలో దసరా సందర్భంగా విశేషపూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పతాంజలీ స్వామి తెలిపారు. స్థానిక అనపగుట్టలోని అభయ లక్ష్మీనర సింహా ఆలయంలో అమ్మవారికి దసరా సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు రమేష్ తెలి పారు. బుధవారం నుంచి 12 వరకు పూజలు ఉంటాయన్నారు.