గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం సౌడాం గ్రామంలో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులో మూడు లక్షల కోట్లు బటన్‌నొక్కి డబ్బులు పంచానని చెప్పారన్నారు. మిగిలిన 6 లక్షల కోట్లు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పట్ట సింహాచలం, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.