ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీబాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు అమ్మవారికి స్నాపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వినాయకుని గుడి వద్ద నుంచి క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకు ఒక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.