సహారా ఖాతాదారులకు డిపాజిట్ సొమ్మును తక్షణమే చెల్లించాలని సహారా కస్టమర్ మరియు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం నాయకులు డిమాండ్ చేశారు. ఆనందమయి కన్వెన్షన్ హాల్లో గురువారం సహారా కార్యకర్తలు, ఖాతాదార్లు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశంలో బోయిన సత్యనారాయణ, బైపల్లి సత్యరాజు, కె. వి. ప్రసాదరావు మాట్లాడారు. సహారా చెల్లింపులు జరగక గత 12 ఏళ్లలో 7674 మంది ఏజెంట్లు, ఖాతాదారులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.