యువత క్రీడాశక్తి పెంపొందించుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్ నాయుడు అన్నారు. కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి వివిధ క్రీడా పోటీ లను పరిశీలించారు. సంప్రదాయ క్రీడలను పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, టీడీపీ నేతలు కింజరాపు హరిప్రసాద్, బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. కొత్తమ్మతల్లి జాతరలో భాగంగా రెండో రోజు బుధవారం కొతమ్మతల్లిని జన సేన నాయకులు దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. విజయనగరానికి చెందిన కోయి డాన్సులు, పగటి వేషాలు ఆకట్టుకున్నాయి.