ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్రా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోక్ అని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా అన్నివర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇవాళ(శుక్రవారం) షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని కోరారు.
ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహారిస్తున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. ఆర్.యస్.యస్ భావజాలం బీజేపీ పాటిస్తుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.