పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపినట్లు పోలవరంపై విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కోరారు. విశాఖపట్నం ఉక్కును రక్షించేది.. కేవలం చంద్రబాబు మాత్రమేనని అన్నారు.. ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలని చెప్పారు. విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న(గురువారం) తిరుపతిలో మాట్లాడిన తీరు బాగోలేదని మండిపడ్డారు.
తిరుపతి లడ్డూ పవిత్రత మీద చంద్రబాబు మాట్లాడటం తప్పు అని చెప్పారు. మాజీ సీఎం జగన్ను రాజకీయాల్లో దెబ్బ కొట్టాలంటే... బెయిల్ రద్దు అయ్యేలా చూడాలన్నారు. దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురాకండని అన్నారు. మోదీ సర్కార్ ఎప్పుడైనా అధికారంలో నుంచి పడిపోవచ్చు. హర్యానా ఎన్నికల తర్వాత బహుశా మోదీ ప్రభుత్వం పడిపోతుందోమోనని చింతా మోహన్ అన్నారు.