ఈరోజు ఉదయం విజయవాడ సీపీ రాజశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చి దుర్గమ్మను సీపీ రాజశేఖర్ బాబు దర్శనం చేసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనానికి వెళ్లే వీఐపీల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను క్రియేట్ చేసినట్లు తెలిపారు. ఆ యాప్ ద్వారా వీఐపీలు వారి టైం స్లాట్‌ను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తాము కూడా ఆ యాప్ ద్వారా టైం స్లాట్ బుక్ చేసుకొని దర్శనానికి వచ్చామని తెలిపారు.
ఆ టైం స్లాట్ ప్రకారం అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. ఇలా యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి అనే రూల్ పెట్టడం ద్వారా వీఐపీలను తాకిడిని నిలుపుదల చేయవచ్చన్నారు. వీఐపీలు ఎంత తక్కువ మంది వస్తే సామాన్య భక్తులకు దర్శన సౌకర్యాన్ని అందించగలుగుతామనే ఉద్దేశంతో యాప్‌ను క్రియేట్ చేశామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీఠ వేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వీఐపీల వాహనాలు పున్నమిఘాటు వద్దకు పెట్టి అక్కడ దేవస్థానం ఏర్పాటు చేసిన వెహికల్స్‌లో మాత్రమే దర్శనానికి రావాలని సీపీ రాజశేఖర్ సూచించారు.