తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.
740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని.. కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీగా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి ఈ లడ్డూ వివాదం తీసుకొచ్చారని విమర్శించారు. జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో దీని గురించి మాట్లాడారన్నారు.