రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కొత్త లైన్ రాబోతుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. రేపల్లె - బాపట్ల , మధ్య కొత్త లైన్ కావాలని కోరామన్నారు. విజయవాడ -గూడూరు మధ్య నాలుగో లైన్ ఏర్పాటు చేయాలని కోరామని.. అలాగే.. బాపట్ల, చీరాలలో వందే భారత్ రైలు స్టాప్ ఉండాలని కోరామని తెలిపారు. బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ కావాలని ప్రతిపాదన పెట్టామన్నారు. గతంలో నిలిపిన సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపులు పునరుద్ధరించాలని కోరామన్నారు. విజయవాడ డివిజన్‌లో 493 లొకేషన్లలో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ రావాల్సి ఉండగా ... గత ప్రభుత్వంలో కేవలం 10 శాతమే కట్టారన్నారు. వెంటనే అన్నీ పూర్తి చేయాలని జీఎంను ఎంపీలంతా కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పెంచాలని ఎంపీలంతా కోరారని అన్నారు. రైళ్లు ఢీ కొనకుండా కవచ్‌ను అన్ని రైళ్లలో ప్రవేశపెడుతున్నట్లు ఎంపీ తేన్నెటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. కొత్త రైల్వే లైన్లు,కొత్త రైళ్లు మంజూరు చేయాలని ఎంపీలు జీఎంను కోరారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అవసరమైన చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఒవర్ బ్రిడ్జీలు నిర్మించాలని ఎంపీలు కోరారన్నారు. కర్నూలులో రైల్వే వర్క్ షాప్‌ను అభివృద్ధి చేయాలని జీఎంను కోరినట్లు ఎంపీ తెలిపారు.