అనంతపురం రూరల్ కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఎం ఎస్ నగర్ లోని ఒకటవ రోడ్డులో అందరూ వెళ్లడానికి ఒక మెయిన్ రోడ్ ఉంది.
శనివారం రోడ్ ఎంట్రెన్స్ లో గంగమ్మకు గుడి కట్టాలని సాలమ్మ-మునిస్వామి దంపతులు భావించి భూమి పూజ చేశారు. 15 సం.లుగా రోడ్డు అందరికీ రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉంది. వీళ్లు ఒక ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులని సమాచారం. ఎమ్మెల్యే బంధువులు అయితే నడిరోడ్డులో గుడి కట్టవచ్చా అని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు.