పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని ఉగ్రవాదులు పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు.
ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.