రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు శుక్రవారం శ్రీసాయి కృష్ణ డిగ్రీ కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆర్‌కయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎనటీకే నాయక్, రిజిస్ర్టార్ ఎస్.వెంకేటశ్వర్లు, శ్రీసాయికృష్ణ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్‌యూ వీసీ మాట్లాడుతూ మహిళలు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవా లని, ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకు క్రీడలు ఎంతగానో అవసరం ఉందని అన్నారు. మనోధైర్యాన్ని కూడా పెంచుతుందన్నారు.
రిజిసా్ట్రర్ మాట్లా డుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని సూచించారు. వివిధ కళాశాలల నుంచి 15 జట్లు కబడ్డీ, చెస్ క్రీడల్లో పాల్గొన్నాయని చెప్పారు. శ్రీసాయి కృష్ణ డిగ్రీ కళాశాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నార. కబడ్డీ పోటీల్లో శంకరాస్ డిగ్రీ కళాశాల నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జట్టుపై 28-19తో, శ్రీసాయికృష్ణ డిగ్రీ కాలేజీ బసిరెడ్డి డిగ్రీ కాలేజీపై 45-14 స్కోరుతో శ్రీలక్ష్మి బీపీఈడీ కాలేజీ నంద్యాల ఎస్‌ఆర్‌కే డిగ్రీకాలేజీపై 29-14 స్కోరుతో, సెయింట్ జోసెఫ్ డిగ్రీ ఉమెన్స కాలేజీ కర్నూలు ఎమ్మిగనూరు ఎస్‌ఎంఎల్ జట్టుపై 23-12 స్కోరు తో గెలుపొందాయి. కార్యక్రమంలో ఆర్‌యూ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన డా.శివకిషోర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.