విజయనగరం జిల్లా, నెల్లిమర్ల, బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2019లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడైన నెల్లిమర్ల మండలం ఏటీ అగ్రహారం గ్రామానికి చెందిన నారు అప్పలనాయుడుకు పదేళ్ల జైలు శిక్ష, రూ.9వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కె.నాగమణి తీర్పు చెప్పారని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నారు అప్పలనాయుడు బొండపల్లి మండలానికి చెందిన ఓ యువతికి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లోబర్చుకుని.. తర్వాత వివాహానికి నిరాకరించడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు అప్పలనాయుడును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో ఆయనకు పది సంవత్సరాల జైలు శిక్ష, 9వేలు జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.