ధర్మవరం పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుక్కపట్నం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హుస్సేనప్ప హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వన్యప్రాణుల పట్ల పర్యావరణం పట్ల ప్రేమను కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడాలని, ముఖ్యంగా అడవులను సంరక్షించాలని అన్నారు.