చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్ చేసి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె స్థానిక జామియా మసీ దు నుంచి సబ్‌కలెక్టరేట్ వరకు ముస్లీంలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సబ్‌కలెక్టరేట్‌కు చేరుకున్న ర్యాలీకి మద్దతుగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహానబాషా మాట్లాడుతూ పుంగ నూరులో అస్ఫియా హత్య ఘటనపై చిత్తూరు ఎస్పీతో చర్చించానన్నారు. ఈ హత్య వెనుక వున్న దోషులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా రు. పోలీసులు కూడా బాధ్యతగా కేసు ధర్యాప్తు చేస్తున్నారన్నారు. . రెండు రోజుల్లో ఈ హత్య కేసును పోలీసులు చేధిస్తారని ఆశిస్తున్నామన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్‌కు వినతి పత్రం అందజేశారు.