శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వ హించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజాదర్బార్ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగింది. అర్జీదారులు ఇచ్చిన వినతులను ఎమ్మెల్యే శంకర్ స్వీకరించి సమస్యల పరిష్కారా నికి కమిషనర్ ప్రసాదరావుతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టేలా సిబ్బం దిని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆరు నెలల్లో పరిష్కరిస్తానని చెప్పారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తానన్నారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన 340 వినతులను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం కనీస వసతులపై దృష్టి సారించలేదన్నా రు. జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం మొదటి స్థా నంలో నిలిచేలా దృష్టి సారిస్తానన్నారు. కార్యక్రమం లో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, నాయకులు కొర్ను ప్రతాప్, అంధవరపు సంతోష్, పాండ్రంకి శంకర్, మైళపిల్లి నర్సింహమూర్తి, కేశవ రాంబాబు, ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.