ఇక్కడ ట్విస్టు ఏంటంటే తనను రేప్ చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై మద్దిలపాలెం పోలీసుస్టేషన్‌లో జాయ్ జమీమా రివర్స్ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమెను పోలీసు కస్టడీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మిగిలిన జాయ్ జమీమా అనుచరుల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు. జెమీమా బాధితులు.. ఒక్క విశాఖలోనే కాదు.. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల కోసం గత అర్థరాత్రి వరకు 65,424 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఈ మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,308 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చాయని సమాచారం.ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరోవైపు నేటి రాత్రితో గడువు ముగియనుంది. దీంతో ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు దాఖలవుతాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. యూఎస్, యూరప్ నుంచి 20 దరఖాస్తులు అందాయని ఉన్నతాధికారులు వివరించారు.