ఈ రోజు దుర్గమ్మ వారికి నిర్వహించాల్సిన హంస వాహనంపై ఊరేగింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులోభాగంగా దుర్గా ఘాటులోని కృష్ణా నది ఒడ్డున హంస వాహనంపై గంగా సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ఆలయ పురోహితులు కైంకర్యాలు నిర్వహించనున్నారు.
కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహ గరిష్ట స్థాయిలో ఉంది. ఎగువ నుంచి దాదాపు 40 క్యూసెకుల వరద నీరు కృష్ణానదిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ వారి జల విహారాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది.